ఒకరు కడుతున్నారు… మరొకరు కూలుస్తున్నారు….
రామగుండంలో గజిబిజి పాలన: బీఆర్ఎస్ నేతల విమర్శ….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, జూలై-31: గోదావరిఖని మెయిన్ చౌరస్తాలోని షాపింగ్ కాంప్లెక్స్‌ను బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కౌశిక్ హరి పరిశీలించారు. అనంతరం వారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ, రామగుండంలో ఒకరు కట్టడం, మరొకరు కూల్చడం వంటి గజిబిజి పాలన కొనసాగుతోందని విమర్శించారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై సింగరేణి విజిలెన్స్‌తో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కాంప్లెక్స్ లబ్ధిదారులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) విధానంలో షాపులు కేటాయించాలని కోరారు.
అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని చెప్పే కాంగ్రెస్ నాయకులు, చిన్నపాటి వర్షానికే ఇళ్లలోకి వరద నీరు చేరుతున్న పరిస్థితులపై ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, పారదర్శక విచారణతో పాటు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు మురళీధర్ రావు, మూల విజయరెడ్డి, జే.వి. రాజు, పట్టణ అధ్యక్షుడు మెతుకు దేవరాజు, బొడ్డు రవీందర్, ఇదినూరు శ్రీకాంత్, ఐ. సత్యం, మారుతి, దొమ్మేటి వాసు, కాల్వ శ్రీనివాస్, గడపురం కళ్యాణ్, సత్యవతి, చింటూ సాయి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
