తిలక్‌నగర్ షాపింగ్ కాంప్లెక్స్ వివాదం…
బీఆర్ఎస్ ఆరోపణలు అవాస్తవం – ప్రజలకు అండగా నిలిచింది ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, : తిలక్‌నగర్ సెంటర్‌లో నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌ను సింగరేణి అధికారులు కూల్చివేసిన ఘటనపై బీఆర్ఎస్ నాయకులు కోరుకంటి చందర్, కౌశిక్ హరి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, 54వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ ముస్తఫా ఖండించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, షాపింగ్ కాంప్లెక్స్‌ను సింగరేణి అధికారులు కూల్చివేస్తున్నారనే సమాచారం అందగానే రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధిత షాపు యజమానులకు అండగా నిలిచారని తెలిపారు. సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో పాటు నిర్మాణ పనులు కొనసాగేందుకు కృషి చేశారని పేర్కొన్నారు.
ప్రజలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌పై బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
అసత్య ప్రచారాలు, రాజకీయ విమర్శలతో ప్రజలను మోసం చేయడం సాధ్యం కాదని, ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలకు ప్రజలే తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ప్రజలకు అండగా నిలవడంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎల్లప్పుడూ ముందుంటారని బొంతల రాజేష్, ఎండీ ముస్తఫా స్పష్టం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
