సేవలకు ఘన సత్కారం – పదవీ విరమణ.

Sakshitha news

సేవలకు ఘన సత్కారం – పదవీ విరమణ…

అనంతరం కూడా ప్రజాసేవ కొనసాగించాలి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…

సాక్షిత పెద్దపల్లి // గోదావరిఖని, జీడీకే-11 ఇంక్లైన్ గనిపై నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సింగరేణి ఉద్యోగి పి. మల్లికార్జున్ పదవీ విరమణ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పదవీ విరమణ పొందిన పి. మల్లికార్జున్, వారి సతీమణిని శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో విధులు నిర్వహించిన కాలంలో మల్లికార్జున్ కార్మికుల సంక్షేమం కోసం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేసిన సేవలు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. పదవీ విరమణ ఉద్యోగ జీవితానికి మాత్రమే పరిమితమని, సమాజ సేవకు కాదని పేర్కొంటూ, ఇకపై కూడా ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

అంతకుముందు జీడీకే-11 గనిపై ఉన్న మైసమ్మ తల్లిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సింగరేణి కార్మికులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top