సర్వమత సామరస్యానికి ప్రతీక నిడుముక్కల 101 దర్గా: ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్
ప్రజల సుఖశాంతులు, రాష్ట్రాభివృద్ధి కోసం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నిడుముక్కల 101 దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
నిడుముక్కల 101 దర్గాలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు
దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన నిడుముక్కల గ్రామంలోని 101 దర్గాల పుణ్యస్థలంలో గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు..101 దర్గా ముజవర్ & ముతవల్లి హజరత్ షేక్ షబ్బీర్ భాష ఆధ్వర్యంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ దర్గాను సందర్శించి ప్రత్యేక దువాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ ఆఫీస్ కార్యదర్శి కంచర్ల శివరామయ్య, తాడికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ నీలాల కృష్ణారావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ మొయిద్దీన్ 101 దర్గా ముజవర్ & ముతవల్లి, హజరత్ షేక్ షబ్బీర్ బాషా ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, నిడుముక్కలలోని 101 దర్గాలు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక విశిష్టతను సంతరించుకున్న అరుదైన పుణ్యక్షేత్రమని అన్నారు.
ఈ పవిత్ర స్థలం సర్వమత సామరస్యానికి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. మతాలకు అతీతంగా దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేయడం ఈ క్షేత్ర గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు. ప్రజల్లో ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించడంలో ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.
రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు సంతోషంగా జీవించాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ఇలాంటి చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు, మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


