కుత్బుల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతన బోర్‌వెల్ ప్రారంభోత్సవం

Sakshitha news

కుత్బుల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతన బోర్‌వెల్ ప్రారంభోత్సవం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధిలోని కుత్బుల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంపీ లాడ్స్ (MPLADS) నిధుల ద్వారా మంజూరైన నూతన బోర్‌వెల్‌ను నేడు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వచ్ఛమైన నీటి సౌకర్యం కల్పించేందుకు ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేసిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ బోర్‌వెల్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందికి స్వచ్ఛమైన నీటి సౌకర్యం అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు, నార్లకంటి ప్రతాప్, నల్లనాగుల కృష్ణ, పెద్దింటి సాయిలు, ప్రవీణ్ గౌడ్, సతీష్ చక్రవర్తి, బాలరాజు, నాగదీప్ గౌడ్, పద్మా రెడ్డి, బాబి నీల, లక్ష్మి, పాపయ్య దొర, అంజయ్య, వీరేశం, దీపిక, వెంకటేశ్వరన్, రాజు, మహేష్, అభిద్, శ్రీకాంత్, తేజ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top