చిలుకూరు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేసిన ఎస్పీ నరసింహ.. .
ప్రజలకు వేగంగా పోలీసు సేవలు అందించడానికి #డోర్స్టెప్ఎఫ్ఐఆర్
ప్రజల భద్రతలో రాత్రింబవళ్లు_పెట్రోలింగ్ నిర్వహిస్తూ గస్తీ ఏర్పాటు చేశాము
వాతావరణ పరిస్థితుల అనుకూలత కోసం చెట్లు అడవులు పెంచాలి
వనమహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేట జిల్లా/చిలుకూరు సాక్షిత : సూర్యాపేట జిల్లాలో పోలీస్ స్టేషన్ ల వార్షిక తనికిల్లో భాగంగా ఎస్పీ నర్సింహా చిలుకూరు పోలీస్ స్టేషన్ ను వార్షిక తనికి చేశారు.అనంతరం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఎస్పీకి స్టేషన్ సిబ్బంది, స్థానిక డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ రామకృష్ణా రెడ్డి, ఎస్ఐ బండి మోహన్ బాబు గౌరవ వందనంతో స్వాగతం తెలిపినారు. సిబ్బంది నిర్వహించిన కవాతును, పోలీసు సామాగ్రి ప్రదర్శనను పరిశీలించి సిబ్బంది పనితీరును ను పరిశీలించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణంలో పోలీస్ సిబ్బంది కలసి వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని సామూహికంగా మొక్కలు నాటారు. ఎల్-నినో లాంటి విపత్కర పరిస్థితుల వల్ల వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో పండే పంటలు వేయాలని అన్నారు. ఇలాంటి పరిస్థితులు వాతావరణం అసమతుల్యం వల్ల సంభవిస్తున్నాయి వీటిని అధిగమించాలంటే చెట్లు, అడవులు పెంచాలి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తెలిపినారు.పోలీస్ స్టేషన్లో వివిధ రకాల రికార్డులను పరిశీలించి కేసులు, ప్రజా పిర్యాదు పెండింగ్ లేకుండా పనిచేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పనితీరును సునిశితంగా పరిశీలించి, సంవత్సరకాలంలో పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదౌతున్న నేరాల రేటు అంశాలపై సమీక్షించారు. నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, ప్రజల భద్రత, మహిళలు, బాలబాలికలు, వెనుకబడిన సామాజిక వర్గాల భద్రత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు చేసుకుని పని చేయాలని అన్నారు. చిలుకూరు మండలం చైతన్యం కలిగిన మండలమని ఇక్కడ వ్యవసాయము అభివృద్ధిలో ఉన్నదని అన్నారు.నూతన భావన నిర్మాణ విషయయాన్ని సంబంధిత అధికారులను తెలిపి, సూర్యాపేట జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి వివరించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామనితెలిపారు.పోలీస్ సేవలు & ప్రజా రక్షణ లో డోర్స్టెప్ ఎఫ్ఐఆర్ అమలు చేస్తున్నాము, బాధితులు లేదా ఇబ్బందుల్లో ఉన్నవారు 100 లేదా 112 కి ఫోన్ చేసినట్లయితే, పోలీస్ సిబ్బంది నేరుగా వారి ఇంటికే వచ్చి ఫిర్యాదు స్వీకరించి, తక్షణమే విచారణ మరియు చర్యలు తీసుకుంటున్నారు అన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ రామకృష్ణా రెడ్డి, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ రాంబాబు, స్టోర్ ఆర్ఎస్ఐ అశోక్, ఎస్పీ సీసీ సందీప్, డిసిఆర్బీ సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, టెక్నికల్ టీం కానిస్టేబుల్ ఆబేద్, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
