తిలక్‌నగర్ షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత ఘటనపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆరా….
ఘటనాస్థలిని పరిశీలించి సింగరేణి అధికారులతో చర్చ….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, తిలక్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌ను సింగరేణి అధికారులు కూల్చివేసిన ఘటనపై రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఘటనాస్థలిని సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కూల్చివేతకు దారితీసిన పరిస్థితులు, సంబంధిత నిబంధనలు, తీసుకున్న చర్యలపై సింగరేణి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చట్టపరమైన నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అనంతరం స్థానికులతో మాట్లాడిన ఎమ్మెల్యే, వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఏసీపీ, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
