గురు పౌర్ణమి వేడుకలు – శ్రీ షిరిడి సాయిబాబా మందిరం, బొమ్మల సత్రం, నంద్యాల.
నంద్యాల జిల్లాలో బొమ్మల – సత్రంలో వెలసిన శ్రీ శిరిడి సాయిబాబా మందిరం నందు భక్తుల తో కిటకిటలాడినది గురు పౌర్ణమి సందర్భంగా విశేషంగా జన సందడి నందు అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం భక్తిశ్రద్ధలతో శ్రీ శిరిడి సాయిబాబాను విశేషంగా భక్తి – శ్రద్ధలతో పూజించటం జరిగినది. భక్తులు విశేషంగా వారి భక్తిని చాటుకున్నారు. నంద్యాల జిల్లాలో కనివిని ఎరుగని రీతిలో ఈ మందిరం చాలా అద్భుతంగా ఉండటం విశేషం. ఈ క్షేత్రాన్ని చూడటానికి భక్తులు రావడం విశేషం. ఈ క్షేత్రంలో ఉదయం నుండి సాయంత్రం వరకు కిట – కిట లాడినది. ముఖ్యంగా ఈ క్షేత్రం నందు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు N.C.C. విద్యార్థులు, మరియు త్రీటౌన్ పి.ఎస్.పోలీసు సిబ్బంది చురుకైన పాత్రను పోషించారు. తదుపరి క్షేత్రం నందు భక్తులకు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగినది. భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత చక్కగా అన్నప్రసాదం స్వీకరించడం జరిగినది. క్షేత్రం యొక్క కమిటీ – సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

