షాపూర్ నగర్‌లో చిన్న వ్యాపారస్తుల దుకాణాల కూల్చివేత దురదృష్టకరం – బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ డిమాండ్*
ఎన్నో ఏళ్లుగా వీధి వ్యాపారంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న షాపూర్ నగర్ రాజీవ్ పార్క్ పక్కన, రెండు వైపులా పూర్తిగా మూసి ఉన్న రోడ్డులో చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్న నిరుపేద వ్యాపారస్తులపై CMC టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా ఉద్దేశపూర్వకంగా చర్యలు చేపట్టి, సుమారు 12 దుకాణాలను పూర్తిగా ధ్వంసం చేయడం అత్యంత బాధాకరమైన విషయం.
ఈ సంఘటనను బీఆర్ఎస్ నాయకులు అన్వర్ వెంటనే డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ దృష్టికి తీసుకురాగా, ఆయన తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని బాధిత వీధి వ్యాపారస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం ఈ విషయాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద దృష్టికి తీసుకువెళ్లగా, ఎమ్మెల్యే వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి బాధిత వీధి వ్యాపారస్తులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పుప్పాల భాస్కర్ మాట్లాడుతూ, ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిరుపేదల జీవనాధారమైన దుకాణాలను కూల్చివేయడం మానవత్వానికి విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి వ్యాపారుల హక్కులను పరిరక్షిస్తూ వారికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

