జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశాలకు జూలై 31 వరకు దరఖాస్తులు…

Sakshitha news

జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశాలకు జూలై 31 వరకు దరఖాస్తులు…

–జిల్లా విద్యాశాఖాధికారి జి. శారద…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, నవోదయ విద్యాలయ సమితి, విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2027–28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (జె ఎన్ వి ఎస్ టి –2027)కు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి జి. శారద తెలిపారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గంగాధర, హుజూరాబాద్, కరీంనగర్, మహదేవ్‌పూర్, మంథని, పెద్దపల్లి, సిరిసిల్ల, సుల్తానాబాద్, వేములవాడ బ్లాకుల్లో ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే జవహర్ నవోదయ విద్యాలయం, కరీంనగర్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి జగిత్యాల, మల్యాల, మెట్‌పల్లి బ్లాకుల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు సంబంధిత జవహర్ నవోదయ విద్యాలయం, జగిత్యాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (జె ఎన్ వి ఎస్ టి –2027)ను 2026 నవంబర్ 28 (శనివారం) నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు 2026 జూలై 31 వరకు ఎలాంటి రుసుము లేకుండా అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
దరఖాస్తుకు అవసరమైన అర్హతలు, ధ్రువపత్రాలు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాల కోసం సంబంధిత జవహర్ నవోదయ విద్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదవ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి జి. శారద కోరారు.

Scroll to Top