తాడిచర్ల బ్లాక్-2, ఆర్‌కేపీ మైన్స్‌కు పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వాలి…

Sakshitha news

తాడిచర్ల బ్లాక్-2, ఆర్‌కేపీ మైన్స్‌కు పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వాలి…

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసిన మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ…..

సాక్షిత పెద్దపల్లి జిల్లా ప్రతినిధి న్యూఢిల్లీ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు కేటాయించిన తాడిచర్ల బ్లాక్-2 ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులను అత్యవసరంగా మంజూరు చేయాలని వారు కేంద్ర మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే స్థానిక యువతకు 1,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి విశేష ఊతం లభిస్తుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ వివరించారు.

అలాగే, ఆర్‌కేపీ మైన్స్‌కు పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులను కూడా త్వరితగతిన మంజూరు చేయాలని మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను విజ్ఞప్తి చేశారు.

ఈ అంశాలపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.

Scroll to Top