కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నూతన డీసీసీ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి నూతనంగా నియమితులైన డీసీసీ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులకు మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి పాల్గొని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా హన్మంతన్నమాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అందరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి , డీసీసీ మహిళ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అంజలి యాదవ్, పార్టీ నాయకులు, డీసీసీ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
