మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని ఘట్‌కేసర్ మున్సిపాలిటీ మరియు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు. ఘట్‌కేసర్, ఎదులాబాద్, పోచారం ప్రాంతాల్లోని పలు పోలింగ్ బూత్‌లను సందర్శించిన, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు–కార్యదర్శులు, BLAలతో కలిసి జరుగుతున్న ప్రక్రియను సమీక్షించారు.
అదేవిధంగా ఘట్‌కేసర్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన BLAల సమీక్ష సమావేశంలో రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
ఘట్‌కేసర్, ఎదులాబాద్, పోచారం ప్రాంతాల్లో జరుగుతున్న SIR ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అధికారులు, BLAలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
