గిరి నగర్ డివిజన్ లో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన డిసిసి ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ చింతల్ సర్కిల్ పరిధిలోని 283 గిరి నగర్ డివిజన్లో నిర్వహించిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు అందిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆయన పంపిణీ చేశారు. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి, ఆర్థిక సాధికారతకు కట్టుబడి పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
అనంతరం గిరి నగర్ డివిజన్లో జరుగుతున్న సర్ ఓటు మ్యాపింగ్ కార్యక్రమాన్ని స్థానిక బూతు లెవల్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు…
ఓటు మ్యాపింగ్ కార్యక్రమాన్ని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకొని ఓటు హక్కును పరిరక్షించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు.….
ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు, స్థానిక డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,జిల్లా కార్యవర్గ సభ్యులు ఏర్వ వేంకట రమణ, జయరాం,షాకీర్, చోటు,శ్యామల, సాయమ్మ, వసంతమ్మ, అబ్దుల్ రౌఫ్, అబ్దుల్ రషీద్, రిజ్వాన్, చోటు,శంకర్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

