చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు మంచే చేస్తుంది తప్ప.. మోసం చేయదు : ప్రత్తిపాటి
సాక్షిత :+గతంలో పాడిఆవు వంటి ప్రభుత్వాన్ని కాదనుకొని సమస్యలు కొని తెచ్చుకున్నారు: ప్రత్తిపాటి
- కూటమిప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉంటేనే ప్రజల ఆశలు నెరవేరతాయి : ప్రత్తిపాటి.
- పట్ణణంలోని పలువార్డుల్లో సుపరిపాలనలో తొలిఅడుగులో పాల్గొన్న ప్రత్తిపాటి.
దోపిడీ విధ్వంసం తప్ప, ఐదేళ్లు రాష్ట్రానికి, ప్రజలకు ఏమీ చేయనివారు సిగ్గులేకుండా, ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై బుద్ధిలేని విమర్శలు చేస్తున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
సుపరిపాలనలో తొలి అడుగు : ఇంటింటికీ తెలుగుదేశంలో భాగంగా ప్రత్తిపాటి పట్ణణంలోని 32, 36, 37 వార్డుల్లో పర్యటించి, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలిచ్చిన అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం ప్రత్తిపాటి మాట్లాడారు.
గత పాలకుల దోపిడీ, అవినీతివల్లే పథకాల అమల్లో జాప్యం
ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను కూటమిప్రభుత్వమే పరిష్కరించిందన్న ప్రత్తిపాటి, వార్డుల్లో చెత్తసేకరణ, వీధిదీపాల ఏర్పాటు, రోడ్లు.. డ్రైన్ల నిర్మాణం వంటి పనులు ఏడాదినుంచి చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వమే త్వరలో ఉచితంగా స్థలం కేటాయిస్తుందన్న ప్రత్తిపాటి, టిడ్కో ఇళ్లు పొందిన వారు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు తప్పక మంచే చేస్తుందన్న ప్రత్తిపాటి..ఆర్థిక సమస్యల వల్లే కొన్నిపథకాల అమల్లో జాప్యం జరుగుతోందన్నారు. గతపాలకులు దోపిడీ, అవినీతి ప్రభావం నుంచి రాష్ట్రం బయటపడాలన్నా, ప్రజల జీవితాలు ఆర్థికంగా బాగుపడాలన్నా కూటమిప్రభుత్వమే ఎక్కువ కాలం అధికారంలో ఉండాలని ప్రత్తిపాటి తెలిపారు. తమకోసం ఎవరు బాగా పనిచేశారో…చేస్తున్నారో ప్రజలు చిత్తశుద్ధితో ఆలోచించాలన్నారు. గతంలో కూడా మాయమాటలు నమ్మి పాడిఆవు వంటి ప్రభుత్వాన్ని వద్దనుకొని పెద్ద తప్పుచేశారని, భవిష్యత్ లో అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రజలు దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. త్వరలో పట్టణంలో నిర్వహించబోయే జాబ్ మేళాను నిరుద్యోగయువత సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, వైస్ చైర్మన్ పిల్లి కోటి, రాష్ట్ర నాయకులు ఇనగంటి జగదీష్, పట్టణ అధ్యక్షులు సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమలా రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మున్సిపల్ డి.ఈ రహీమ్ , క్లస్టర్ ఇంచార్జి, యూనిట్ ఇంచార్జి లు, తెలుగు మహిళ నాయకులు, వార్డు కౌన్సిలర్ లు, వార్డు అధ్యక్ష కార్యదర్శులు , ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
