బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో బతుకమ్మ గ్రౌండ్‌

Sakshitha news

బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో బతుకమ్మ గ్రౌండ్‌ను పునరుద్ధరించి షెడ్ ఏర్పాటు చేయాలని కోరిన స్థానికులు – హామీ ఇచ్చిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

సాక్షిత :: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన గ్రౌండ్‌లో పలువురు అనధికారికంగా షెడ్లు నిర్మించి షాపులు నిర్వహిస్తున్న విషయాన్ని స్థానికులు *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి * దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై వెంటనే స్పందించిన కొలన్ హన్మంత్ రెడ్డి ఈరోజే సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుని పనులను పూర్తి చేయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, బతుకమ్మ వంటి సాంప్రదాయ వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా కేటాయించిన స్థలాన్ని తిరిగి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. గ్రౌండ్‌పై ఉన్న ఆక్రమణలను తొలగించి, మహిళలు మరియు స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన షెడ్ ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అదేవిధంగా కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై కూడా స్పందిస్తూ, అవసరమైన చోట్ల విద్యుత్ లైట్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం, పారిశుధ్య పనులు, అంతర్గత రహదారుల అభివృద్ధి మరియు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసి దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టేలా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీ వాసులు, స్థానిక ముఖ్య నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

Scroll to Top