ఇందిరమ్మ రాజ్యంలో గిరిజన అభివృద్ధికి పెద్దపీట
ప్రతి గిరిజన ఆవాస ప్రాంతంలో సేవాలాల్ ఆలయ నిర్మాణం
ఇందిరమ్మ ఆశీర్వాద స్వర్ణోత్సవ వేడుకల సన్నాక సమావేశంలో
MLA మేఘారెడ్డి
సాక్షిత వనపర్తి :
ఉక్కు మహిళ ఇందిరా గాంధీ కాలం నుంచి నేటి వరకు గిరిజన అభివృద్ధి కోసం పాటుపడ్డా ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ నేనని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు
వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఆశీర్వాదం స్వర్ణోత్సవ వేడుకల బస్సు యాత్ర సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు
1976 లోనే గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు
గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల గిరిజన కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు అందుతున్నాయి అన్నారు
. రేవంత్ రెడ్డి సర్కారులను గిరిజనులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్న అన్నారు
వనపర్తి నియోజకవర్గం పరిధిలోని గిరిజనులు ఉండే ప్రతి ఆవాస ప్రాంతంలో సేవాలాల్ ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు
ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత కరెంటు, విద్యార్థులకు ఉన్నత విద్య, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతు భరోసా రాయితీపైన అనేక పథకాలను అందజేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు
ఇందిరమ్మ కాలం నుంచి గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి అండదండగా నిలుస్తున్నారన్నారు
. శనివారం రోజున వనపర్తి జిల్లా కేంద్రానికి ఇందిరమ్మ ఆశీర్వాద స్వర్ణోత్సవవేడుకల బస్సు యాత్ర వస్తుందని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గిరిజన సహోదరులు హాజరై విజయవంతం చేయాల్సిందిగా ఆయన సూచించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిరిజన నాయకులతో కలిసి బస్సు యాత్ర పోస్టర్ను రిలీజ్ చేశారు
కార్యక్రమంలో గిరిజన సర్పంచ్లు, మాజీ ఎంపీపీలు మాజీ ఎంపిటిసిలు మాజీ సర్పంచులు గిరిజన సంఘం నాయకులు గిరిజన యువకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
