అనుమతుల్లేని నిర్మాణాల తొలగింపు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నగరపాలక సంస్థ పరిధిలోని గోదాదేవి మార్గంలో వెంకటేశ్వర స్కూల్ వెనుక భాగంలో అనధికారికంగా నిర్మిస్తున్న నిర్మాణాలను తొలగించామని డిప్యూటీ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ నగరంలోని గోదాదేవి మార్గంలోని వెంకటేశ్వర స్కూల్ వెనుక అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. కమిషనర్ మౌర్య ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం నుంచి అనుమతులు లేని భవన నిర్మాణాలను పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది తొలగించారని తెలిపారు. నగరంలో అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్మాణాలు చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీసీపీ వెంట ఏసిపి మూర్తి, మధు, టిపిఓ వంశీ, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
