సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తాత్కాలిక ఉపాధ్యాయ, అధ్యాపక ఖాళీలకు దరఖాస్తు కోరిన… జోనల్ అధికారి విద్యులత
…
సాక్షిత వనపర్తి :
వనపర్తి జిల్లా లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తాత్కాలిక పద్ధతి న ఉపాధ్యాయ/ అధ్యాపక ఖాళీలను భర్తీ చేయుచున్నట్లు జోనల్ అధికారి శ్రీమతి విద్యులత తెలిపారు.
అర్హత కలిగి ఆసక్తి కలిగిన అభ్యర్థులు తేదీ: 27-06-2026 న మహిళ డిగ్రీ కాలేజ్, వనపర్తి నాగవరం లో గల సాంఘిక సంక్షేమ కళాశాలలో అర్హత సర్టిఫికెట్స్ (ఒరిజినల్ మరియు జిరాక్స్ )తో డెమోకు హాజరు కావలెనని తెలిపారు. ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు.
బాలికల పాఠశాల/ కళాశాలలో బోధించుటకు మహిళా అభ్యర్థులు అర్హులు ,
బాలుర పాఠశాలలు/ కళాశాలలో 9 ఖాళీలు కలవు:
- జేఎల్ కెమిస్ట్రీ-1,
- టిజిటి హిందీ-2,
3.టిజిటి మ్యాచ్-1,
4.పిజిటి బయోసైన్స్-1,
5.టీజీటీ బయోసైన్స్-1,
6.పి జి టి ఫిజికల్ సైన్స్-1,
7.టీజీటీ ఫిజికల్ సైన్స్-1,
8.సోషల్ స్టడీస్-1.
బాలికల పాఠశాలలు/కళాశాలలో ఖాళీల వివరాలు: - పిజిటి ఇంగ్లీష్-1.
డిగ్రీ కళాశాలలో ఖాళీల వివరాలు 8 ఖాళీలు కలవు:
1.ఇంగ్లీష్ -2,
2.జువాలజీ-1,
3.కెమిస్ట్రీ-1, - మైక్రో బయాలజీ-1,
5.కంప్యూటర్ సైన్స్-2,
6.కామర్స్-1.
