అంతర్జాతీయ తైక్వాండో క్రీడలో బంగారు పథకాలను సాధించిన

Sakshitha news

అంతర్జాతీయ తైక్వాండో క్రీడలో బంగారు పథకాలను సాధించినక్రీడాకారున్ని శాలువాలతో సత్కరించి అభినందించిన ఎమ్మెల్యే

క్రీడలతో ప్రపంచ గుర్తింపు పొందవచ్చు ఎమ్మెల్యే

సానే వినోద్ కుమార్ రెడ్డి దేశానికే గర్వకారణం

సాక్షిత వనపర్తి :
ఇటీవల బ్యాంకాక్ లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో క్రీడా పోటీల్లో వనపర్తి జిల్లాకు చెందిన సానె వినోద్ కుమార్ రెడ్డి 2 బంగారు పథకాలు, 1 కాస్యం పథకం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచారని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు

వనపర్తి మండలం మాజీ ఎంపీపీ సానే కిచ్చారెడ్డి కుమారుడు సానే వినోద్ కుమార్ రెడ్డి ఈ పథకాలు సాధించడం ద్వారా దేశానికే కాక వనపర్తి జిల్లా, మండలం గ్రామానికి సైతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు

విద్యార్థులు, యువకులు ఉన్నత చదువులతో పాటు క్రీడలపై దృష్టిసారిస్తే ఉన్నత స్థాయి గుర్తింపును పొందవచ్చునని ఆయన సూచించారు

ఈ సందర్భంగా హైదరాబాదులోని మాదాపూర్ లో గల తన కార్యాలయంలో ఎమ్మెల్యే క్రీడాకారుడు సానే వినోద్ కుమార్ రెడ్డి ని శాలువాలతో సత్కరించి అభినందించారు

Scroll to Top