ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు వీరన్న
సాక్షిత మోతె: మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు వీరన్న ఆధ్వర్యంలో కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం చిన్నారులకు పండ్లు పంపిణీ చేసి సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సేవలో ఉత్తమ్ పద్మావతి రెడ్డి మరింత ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు బొక్క వీరారెడ్డి, సామ పెద్ద వెంకటరెడ్డి, దోసపాటి చిరంజీవి, బొడ్డు నర్సయ్య, రాపర్తి కాటంరాజు, ఎం.డి. ఫరీద్, వార్డ్ సభ్యురాలు అనంతుల భద్రమ్మ, ఇటుకల సతీష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
