మహిళా సురక్ష వేదిక రామగుండం కార్పొరేషన్ శాఖ…
ఖమ్మం బాలిక హత్యాచార ఘటనపై మహిళా సురక్ష వేదిక ఆగ్రహం…
నిందితుడు మహమ్మద్ గౌస్‌కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ధర్నా…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం, మహిళా సురక్ష వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు మహిళా సురక్ష వేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాధ్యులు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో 12 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి అనంతరం భవనం పై నుంచి తోసివేసి హత్య చేసిన ఘటన అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు మహమ్మద్ గౌస్‌పై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకుని ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలని, మహిళలు మరియు చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రంలో మహిళలపై, బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు.
హిందూ మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఘటనలపై సమాజం అప్రమత్తంగా ఉండాలని, మహిళల రక్షణ కోసం ప్రజలు ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
అనంతరం కార్పొరేషన్ అధికారి సతీష్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా సురక్ష వేదిక బాధ్యులు లలిత, కోట తిరుమల, పైతరి శరణ్య భవాని, ఇందిర, వీణ, వందన, హరిణి, శ్రీజ, మునిగాల సంపత్, అడిగొప్పుల రాజు, పైతరి రాజు, సంపత్ యాదవ్, మ్యాడగోని రవీందర్, ఆరెల్లి జలంధర్, పొన్నం శశికుమార్ రాజకుమార్, పల్లికొండ ప్రశాంత్, సంజీవ్, గోటిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
