ప్రభుత్వ పాఠశాలలకు వెంటనే దుస్తులను అందించాలి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ డిమాండ్.
సాక్షిత : సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని తెలుసుకోవడానికి నేడు జగద్గిరిగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సిపిఐ బృందం పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంకా రెండు రోజుల్లో పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని కానీ నేటికీ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ప్రభుత్వం నుండి అందాల్సిన విద్యార్థుల యూనిఫాం అందలేదని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బోధించడానికి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు లేరని మరియు పారిశుద్ధ్య రక్షణ సమస్యలు ఉన్నాయని సందర్శనలో తెలిసిందని కావున ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు అందించి, తగిన బోధన సిబ్బంది ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి ఎం సహదేవరెడ్డి ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు సిపిఐ నాయకులు కృష్ణ శ్రీనివాస్ చారి యువజన నాయకులు కార్తీ క్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
