పామీరెడ్డి పల్లి గ్రామం లో ఇంటింటా బడిబాట కార్యక్రమం
సాక్షిత వనపర్తి :
పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో బలిజపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాల కు చెందిన ఉపాధ్యాయులు సోమవారం బడిబాట కార్యక్రమం లో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి విద్యార్థులను గుర్తించి బలిజపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులను చేర్పించే విధంగా తల్లిదండ్రులకు తమ (జెడ్ పి హెచ్ ఎస్ బలిజపల్లి) ప్రభుత్వ పాఠశాలలో ఆటలు ట్వింకిల్ ల్యాబ్ వసతి కలదని అదేవిధంగా డిజిటల్ విద్యను అందించే విధంగా డిజిటల్ లో టీవీలు కలవని పాఠశాలలో అనుభవజ్ఞులైన 22 మంది ఉపాధ్యాయులు కలరని లైబ్రరీ వసతి కలదని మంచి ఆటల ప్రాంగణం కలదని తెలియజేస్తూ ఐదవ తరగతి చదివి ఆరో తరగతికి వెళ్లే 12 మంది విద్యార్థిని విద్యార్థులు గుర్తించి వారు పాఠశాలకు వచ్చే విధంగా అడ్మిషన్ ఫామ్స్ ను ఇవ్వడం జరిగిందని ఏ ఎం ఓ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎమ్ఓ మహానంది, పాఠశాల ఉపాధ్యాయులు వరప్రసాద్ గౌడ్ సత్యనారాయణ బాలరాజు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
