గోదావరిఖని రిటైల్ మార్కెట్ అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన బీజేపీ నాయకులు సొమరపు లావణ్య….
మౌలిక వసతుల లేమిపై ఆగ్రహం…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని రిటైల్ మార్కెట్‌లో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మూడు దుకాణాలు దగ్ధమైన ఘటనపై బీజేపీ నాయకులు సొమరపు లావణ్య- అరుణ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఉదయం వారు మార్కెట్‌ను సందర్శించి అగ్నిప్రమాద బాధిత వ్యాపారులను పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుని, అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
మార్కెట్‌లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, మున్సిపల్ కార్పొరేషన్, పాలక మండలి, స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి కారణంగా సమస్యలు మరింత పెరుగుతున్నాయని వారు విమర్శించారు. ముఖ్యంగా మహిళల కోసం తగిన మూత్రశాలలు లేకపోవడం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడం, మార్కెట్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వంటి అంశాలపై అధికారులను ప్రశ్నించారు.
వ్యాపారులు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించి, భవిష్యత్తులో ఇటువంటి అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను వారు డిమాండ్ చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
