కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురి శుభకార్యాల ఆహ్వాన పత్రికలు మరియు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించిన స్థానిక మాజీ శాసనసభ్యులు *కూన శ్రీశైలం గౌడ్……
*సాక్షిత : కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ షాపూర్ నగర్ లోని వారి నివాసంలో నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక ప్రజలు పలు మౌలిక సమస్యలపై కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం మరియు అంతర్గత రోడ్లు, డ్రైనేజీ మరియు మంచి నీటి సరఫరా, సమస్యలపై వారిని కలిసి వినతి పత్రాలను అందించారు..
మహాదేవపురం డివిజన్ కి చెందిన ప్రసాద్ దుగ్యాల మాజీ ఎమ్మెల్యే పై ఉన్న అభిమానం తో ప్రత్యేకంగా చేయించిన ఫోటోను బహూకరించారు…
కాంగ్రెస్ అనుబంధ సంఘం INTUC లో వివిధ పదవులు పొందిన వారు మాజీ ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
