కార్మికుల సమస్యల పరిష్కారానికి మూడు రోజుల నిరసన కార్యక్రమం….
జూన్ 8 నుంచి 10 వరకు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆందోళనలు….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:ఎన్టిపీసి, ఎన్టిపీసి కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేస్తూ, కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం (జె ఎ సి) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.
తేది 08-06-2026 నుండి 10-06-2026 వరకు ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుండి 10:00 గంటల వరకు ఈ ఆందోళనలు కొనసాగనున్నాయని వెల్లడించారు.
ఈ సందర్భంగా JAC నాయకులు మాట్లాడుతూ, కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, పలుమార్లు యాజమాన్య దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు, భద్రతా సదుపాయాలు, ఉద్యోగ భరోసా, మెడికల్, పోలీస్ వెరిఫికేషన్ డిపెండెంట్ ఉద్యోగ, కార్మిక సంక్షేమ అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ప్రతి కార్మికుడు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలియజేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల ఐక్యతే తమ బలమని, శాంతియుతంగా జరిగే ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
“ఐక్యతే మన బలం – పోరాటమే మన హక్కుల సాధనకు మార్గం” అనే నినాదంతో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు సమాచారం.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
