టి యు ఎఫ్ జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ అబ్దుల్ లతీఫ్
సాక్షిత వనపర్తి : తెలంగాణ
ఉద్యమకారుల ఫోరం (TUF) వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ ని నియమించడం జరిగింది ఈ మేరకు నియామక పత్రాన్ని రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ చేతుల మీదుగా అందాచేశారు, జిల్లాలోనిఉద్యమకారుల సంక్షేమం కోసం పని చేయాలని ఆయన కోరారు, ఉద్యమ కారుల ఆత్మ గౌరవ కోసం పోరాడుతాననీ డా,,యం,ఏ, లతీఫ్ వెల్లడించారు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరాటంలో తన వంతు పాత్ర పోషించానానితెలిపారు, నిజమైన ఉద్యమ కారుల కోసం పని చేస్తానని,రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారంటీ లలో ఉద్యమ కారులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో. కే.కే కమిటీలో తనవంతు పాత్ర పోషిస్తానని తెలిపారు, తెలంగాణ ఉద్యమకారుల మలిదశ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉద్యమకారుడుగా తెలంగాణ ఉద్యమాలలో ప్రతి కార్యక్రమం లో పాల్గొన్నా,
తెలంగాణ కోసం జరిగిన పోరాట ఉద్యమంలో ప్రతి దశలో కీలకంగా పనిచేశానని, వనపర్తి జిల్లాలో జరిగే ప్రతి తెలంగాణ ఉద్యమానికి ముందుండి నడిపించారు, ఎన్నో ఉద్యమాలు చేసి పోలీసులచే బైండోవర్లు జైలుకు పోయి వచ్చానని మొదటినుంచి టిఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నానని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
