కార్మిక క్రీడాకారుడు బచ్చ ప్రవీణ్ కుమార్‌ ఉద్యోగ విరమణ.

Sakshitha news

కార్మిక క్రీడాకారుడు బచ్చ ప్రవీణ్ కుమార్‌ ఉద్యోగ విరమణ…

–అధికారులు, ఆత్మీయుల సన్మానం …
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: సింగరేణి సంస్థలో 39 సంవత్సరాలపాటు సుదీర్ఘకాలం సేవలందించి ఆర్జీ-3 ఓసియం-1లో ఈపీ ఫిట్టర్‌గా ఉద్యోగ విరమణ పొందిన కార్మిక క్రీడాకారుడు బచ్చ ప్రవీణ్ కుమార్ ను అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, సహోద్యోగులు ఘనంగా సన్మానించారు. ఓసియం-1 బేస్ వర్క్‌షాప్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్జీ-3 జీఎం సుంకర మధుసూదన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రవీణ్ కుమార్, ప్రభావతి దంపతులను శాలువాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ క్రమశిక్షణ, నిబద్ధత, సేవాభావానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. విధుల్లో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు అందరితో స్నేహపూర్వకంగా మెలిగేవారని ప్రశంసించారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఉద్యోగిని సంస్థ కోల్పోవడం నష్టమే అయినప్పటికీ ఉద్యోగ విరమణ అనివార్యమని పేర్కొన్నారు.

అనంతరం ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్టు సీనియర్ క్రీడాకారులు ప్రవీణ్ కుమార్‌ను సన్మానించి షటిల్ రాకెట్‌ను బహుకరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు శంకర్, పాపయ్య, సుధాకర్ రెడ్డి, కాశీ విశ్వేశ్వర్ రావు, నసీర్ అహ్మద్, రఘు కుమార్, సత్యనారాయణ, సాయి స్వరూప్, కార్మిక సంఘాల నాయకులు నక్క రమేష్, సదానందం, క్రీడాకారులు హరికిషన్, ముకేశ్ కుమార్, చంద్రపాల్, శేషగిరి, అల్లం రమేష్, కేఎల్‌ఎన్ ప్రసాద్, గంధం శ్రీనివాస్, నరసింహారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శివ, బుగ్గాజి, జక్కుల దామోదర్, పూర్ణాకర్, వాసు, రవి, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top