స్వచ్ఛ భారత్ లక్ష్యానికి చేయూతగా ఎన్టీపీసీ రామగుండం స్వచ్ఛత పఖ్వాడా కార్యక్రమం…
రామగుండం రైల్వే స్టేషన్లో స్వచ్ఛత పఖ్వాడా నుక్కడ్ నాటక్ నిర్వహించిన ఎన్టీపీసీ…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం,
స్వచ్ఛత పఖ్వాడా కార్యక్రమాల సందర్భంగా ఎన్టీపీసీ రామగుండం, దక్షిణ మధ్య రైల్వే (SCR) సహకారంతో రామగుండం రైల్వే స్టేషన్లో నుక్కడ్ నాటక్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజల్లో పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత అలవాట్లు మరియు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్ (GEM) విద్యార్థినులు సామాజిక సందేశాలతో కూడిన ప్రదర్శనలు ఇచ్చి, ప్రజా ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరాన్ని తెలియజేశారు. స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీపీసీ రామగుండం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్ & టీ) చందన్ కుమార్ సామంత హాజరయ్యారు. హెచ్ఓహెచ్ఆర్ సాగర్ రంజన్ సాహూ, హెచ్ఆర్ బృందం, ఎంజిఆర్ మరియు ఎఫ్ఎం విభాగాల అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
