ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ …
సాక్షిత :ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ఐడిపిఎల్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి నందమూరి తారక రామారావు (NTR) విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారిని స్మరించుకున్నారు…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వ వ్యాప్తంగా తీసుకెళ్లిన గొప్ప మహనీయుడని, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి వినలేని కృషి చేశారని అదేవిధంగా సినీ రంగంలో గొప్ప నటనతో ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేసుకున్నారు..
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జై రామ్, రంగారావు, కూన రాఘవేందర్ గౌడ్, మోటే శ్రీనివాస్ యాదవ్, గడ్డం రాజేందర్ రెడ్డి, రవి, దిలీప్, శంకరయ్య, రవీందర్ గుప్తా, మల్లం శీను, శంకర్ గౌడ్, తోకల శీను, శ్రీకాంత్ ,చోటు ఓంకార్, శివ, సురేందర్, క్రాంతి తదితరులతో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
