మహిళల అభివృద్ధికి మరో మైలురాయి….
పాలకుర్తిలో మహిళా వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పాలకుర్తి,
మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు మరింత ఊతమిచ్చే దిశగా పాలకుర్తి గ్రామంలో మహిళా వీఓ (విలేజ్ ఆర్గనైజేషన్) భవన నిర్మాణ పనులకు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ, ఆర్థిక స్వావలంబన సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు.
మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ఈ భవనం కేంద్రంగా మారుతుందని తెలిపారు.
మహిళా సంఘాలు గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్న ఎమ్మెల్యే, వారి కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని, వారి సామాజిక, ఆర్థిక పురోగతికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
మహిళా వీఓ భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత మహిళా సంఘాల కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగడంతో పాటు గ్రామీణ మహిళలకు వివిధ శిక్షణా, ఉపాధి అవకాశాల కల్పనకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, మండల అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
