రాబందుల రాజ్యం మనకొద్దు

Sakshitha news

రాబందుల రాజ్యం మనకొద్దు

ఆదాని,అంబానీ లాంటి రాబందులను ప్రోత్సహిస్తూ నిరుపేదలను నిలువున ముంచుతోంది బిజెపి సర్కార్
ఇంధన పెంపుదలను నిరసిస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలో చేపట్టిన ఎద్దుల బండ్ల నిరసన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి

సాక్షిత వనపర్తి :

డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ కేంద్ర బిజెపి సర్కార్ మొదటి భోగిలో మోదీ రెండో భోగిలో ఆదాని అంబానీ లాంటి వారు ప్రయాణిస్తూ దేశాన్ని రాబందుల పిక్కుతింటున్నారని ఈ డబల్ ఇంజన్ సర్కారుకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు mla మేఘారెడ్డి, శివసేనరెడ్డి లు వనపర్తి లో ఎద్దుల బండ్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇంధనంపై పెంచిన రేట్లు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు

గంటలు మోగిస్తే చప్పట్లు కొట్టినంత మాత్రాన నిరుపేదల సమస్యలు తీరవని, ప్రజలకు అధిక భారం లేకుండా చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం అధిక ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు

భారతీయ జనతా పార్టీ నాయకులు వనపర్తి లో ధర్నాలు చేయడం సరికాదని బాధ్యత యుతంగా వ్యవహరించి మోడీ ఇంటి ముందల ధర్నాలు చేసి రాష్ట్రానికి ఏదైనా మేలు చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు

మాయమాటలు చెప్పే అధికారులకు వచ్చిన మోడీ సర్కార్ ఇప్పటికే మూడు పర్యాయాలు ఏడున్నర రూపాయలను పెట్రోల్ డీజిల్ పై పెంచిందని పేర్కొన్నారు

మోడీ సర్కార్ ఇంధనం ధరలను వెంటనే తగ్గించకపోతే జిల్లా మండల గ్రామస్థాయిలోని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి మెడలు వంచాల్సి వస్తుంది అన్నారు

టిఆర్ఎస్ బిజెపి పార్టీలు మంచి దోస్తాన్ మైంటైన్ చేస్తున్నాయని వారి కార్యకలాపాలు నిరసిస్తూ మనం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు

దేశంలోని 19 రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వమే ఉందని మరి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదంటూ నిలదీశారు

వడ్ల కొనుగోలు నీతులు చెప్పే నాయకులు వడ్ల కష్టాలు పెంచడానికి మీరు పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వాస్తవం కాదా అన్నారు

ఎఫ్ సి ఐ లకు, గోదాములకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టకపోగా పైపెచ్చు ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదన్నారు

వారి నిరంకుష పాలనను నిరసిస్తూ అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లి నరేంద్ర మోడీ సర్కార్ను ముట్టడించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు

తెలంగాణలో రేవంత్ రెడ్డి అనే ఇంజన్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని రానున్న రోజుల్లో కేంద్రంలోనూ రాహుల్ గాంధీ మరో ఇంజన్ గా మారతారని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు

కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, వనపర్తి నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పెద్దయించిన పాల్గొన్నారు

Scroll to Top