గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి కార్మికుడికి పని కల్పించేందుకు చర్యలు……. అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్
సాక్షిత వనపర్తి
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ప్రతి కార్మికునికి పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్ ఆదేశించారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఈ సంవత్సరము జూన్ వరకు పొడిగించడం జరిగిందని దీనిని గ్రామీణ ప్రాంతమంలో.సద్వినియోగం చేసుకొని పని కోరుకునే ప్రతి ఒక్కరికి పని కల్పించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
గురువారం అదరపు కలెక్టర్ తన చాంబర్లో ప్రత్యేక అధికారులతో ఉపాధి హామీ పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏ పని అయినా చేయవచ్చని ప్రస్తుతము కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, మ్యాజిక్ ఇంకుడు గుంతలు, రూఫ్ టాప్ జల సంరక్షణ వంటి అనేక రకాల పనులు సృష్టించి పనులు కోరుకునే ప్రతి కార్మికుడికి పని దినాల కల్పించాలని సూచించారు.
జాబ్ కార్డు ఉన్న జాబితాను గ్రూపు లో పెట్టాలని, 18 సంవత్సరాల వయస్సు నిండి పని కోరుకునే ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు జారీ చేయాలని ఆదేశించారు . ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు గ్రామీణ ఉపాధి హామీ పనులు ముగించుకొని వెళ్లిపోవచ్చని చెప్పారు. పని వేళల్లో కార్మికులకు చలువ నీడ, మంచినీరు, ఓ ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి కొత్తగా పనులు సృష్టించడం, పని కోరుకునే వారికి జాబ్ కార్డులు జారీ చేయడం వంటి పనులు చేపట్టాలని తెలియజేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని దినాల సంఖ్యను పెంచితే గ్రామ పంచాయతీలకు సి.సి. రోడ్లు వేసుకోడానికి మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుందని స్పష్టం చేశారు. ఉన్న జాబ్ కార్డులో ప్రతి రోజు కనీసం 40 శాతం కార్మికులకు పని దినాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జడ్పీ సీఈవో యాదయ్య, పి డి ఆర్ డి ఓ ఉమాదేవి, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
