దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన త్రిచక్ర వాహనాల పంపిణీ…..
–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, దివ్యాంగులు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలు వారికి కొత్త ఆశలను కల్పిస్తున్నాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు.
బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన, ఉచిత మోటరైజ్డ్ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని 20 మంది దివ్యాంగ లబ్ధిదారులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో జీవించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ఉచిత మోటరైజ్డ్ ట్రైసైకిళ్ల ద్వారా వారి రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు.
ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేస్తోందన్నారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు, నిరంతరం కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.వాహనాలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
