అనాధ పిల్లల మధ్య వివాహ వార్షికోత్సవం… మాతృదేవోభవ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఓరుగంటి రమాదేవి,వెంకటేశ్వర్లు….*
సాక్షిత : మాతృదేవోభవ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి ఓరుగంటి రమాదేవి వెంకటేశ్వర్లు వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాధాశ్రమం లోని పిల్లలకు అల్పాహారం అందజేయడం జరిగింది. అదేవిధంగా కోదండ రామాలయం ఆవరణలో ఒక బీద కుటుంబానికి నెలకి సరిపడా నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కార్యదర్శి రమాదేవి, డైరెక్టర్ బండారు శ్రీనివాసరావులు మాట్లాడుతూ అనాధ పిల్లల మధ్య వివాహ వార్షికోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని, సమాజంలోని అనాధ పిల్లలకు, బీదవారికి తమ వంతు చేయూతనివ్వాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో ,కార్యదర్శి ఓరుగంటి రమాదేవి, కోశాధికారి ఇమ్మడి సతీష్ బాబు, డైరెక్టర్లు వంకాయల స్వాతి, బండారు శ్రీనివాసరావు, వెంపటి ప్రసాద్, ఓరుగంటి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
