నిరుద్యోగ యువతకు శుభవార్త… ఫోన్‌పే కంపెనీలో ఉద్యోగాలకు జాబ్ మేళా….
మే 22న పెద్దపల్లి జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 22న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ తెలిపారు.
ఫోన్‌పే కంపెనీలో మొత్తం 50 బిజినెస్ డెవలప్మెంట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన 18 నుండి 38 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18 వేల నుండి రూ.22 వేల వరకు వేతనం అందజేయనున్నట్లు తెలిపారు. పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట, మంథని, కాళేశ్వరం, కాటారం, హుజూరాబాద్, హుస్నాబాద్ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22న ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం, మొదటి అంతస్తు, రూమ్ నెంబర్ 233లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, అప్డేటెడ్ బయోడేటా లేదా రెజ్యూమే, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీతో పాటు అనుభవం ఉంటే ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకురావాలని తెలిపారు.
మరిన్ని వివరాలకు 8985336947, 8121262441 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
