మరి కుంట చెరువు అలుగు నీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన……… మరి కుంటకాలనీవాసులు
మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం
సాక్షిత వనపర్తి :
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డు మరి కుంట చెరువు నుండి ప్రతి సంవత్సరం వర్షాకాలం లో చెరువు నిండి అలుగు నీరు పారి దిగువన ఉన్న కాలనీలోని ఇండ్లలోకి ప్రవహించిన నీటితో దుర్వాసన వెదజల్లుతూ ఉండడంతో రోగాల బారిన పడుతూ కాలనీ ప్రజలు ఇండ్లలో ఉండలేక సొంత ఇండ్లను వదల్లేక నరకాన్ని అనుభవిస్తున్నామని ఇదే విషయంపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని చెరువు అలుగు నీరు కర్నూల్ రోడ్డుపై పారుతూ సామాన్యులు నడవడానికి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతుందని ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఏర్పడుతోందని గతంలో కర్నూల్ రోడ్డుపై కల్వర్టు నిర్మించడం జరిగిందని ఆ కలవర్టు గుండా అలుగు నీటిని పోయే విధంగా నిర్మాణం చేపట్టలేదని ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితిని భరించలేక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసి అలసిపోయామని దీంతో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు వినతి పత్రం ద్వారా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం వెంకట్రెడ్డి ఆంజనేయులు సుధీర్ రామకృష్ణారెడ్డి సాగర్ ఆలుగు నీటి కాలనీ బాధితులు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
