ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది ప్రజల ఓటే : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ …
సాక్షిత : బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు 125 – గాజుల రామారం డివిజన్ పరిధి
చిత్తారమ్మ ఫంక్షన్ హాల్ లో స్పెషల్ ఇంటెన్షవ్ రెవిషన్ (SIR) పై నిర్వహించిన అవగాహన సమావేశానికి గాజుల రామారం డివిజన్ కు చెందిన నాయకులకు, బిఎల్ఏలకు అవగాహన
సదస్సు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్యఅతిధిగా హాజరై స్పెషల్ ఇంటెన్షవ్ రెవిషన్ (SIR) కార్యక్రమ నిర్వాహణ, పాటించవలసిన నియమ, నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది ప్రజల ఓటే.
2002 జనాభా ప్రాతిపదికన ఎన్నికల సంఘం అద్వర్యంలో నిర్వహిస్తున్న ఈ SIR కార్యక్రమంలో నిజమైన ఓటర్లను గుర్తించడంతో పాటు, డూప్లికేట్ ఓట్లు, పర్మినెంట్ మైగ్రేటెడ్ ఓట్లు, అసలు మనుషులు లేని పేర్లతో ఉన్న ఓట్లను గుర్తించడం, కుటుంబ సభ్యుల ఓట్లను మ్యాపింగ్ చేయడం, కొత్త ఓటర్లను చేర్చడం, ఇంకా ఏమైనా చేర్పులు, మార్పులు ఉంటే వాటిని సరిదిద్దేలా నాయకులు, బిఎల్ఏలు, సంక్షేమ సంఘాల నాయకులు, సీనియర్ సిటిజన్స్, యువత ఒక బాధ్యతగా తీసుకొని ప్రజలను చైతన్య పరుస్తూ అధికారులను సమన్వయ పరుచుకుంటూ సర్ కార్యక్రమాన్ని సద్వినియోగ పరుచుకోవాలనేలా పనిచేయాలన్నారు. ఓటరు జాబితాలో ఎటువంటి తప్పలు లేకుండా నాయకులు, బిఎల్ఏలు అప్రమత్తతో పనిచేయాలన్నారు.
అదేవిధంగా రానున్న రోజుల్లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంకై చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం, నూతన కమిటీల నియామకంతో పాటు పార్టీ బలోపేతానికి మరింత ప్రజల్లోకి ఎలా దూసుకువెళ్లాలనే చేపట్టవలసిన కార్యాచరణను వివరించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, అంజన్ గౌడ్, నవాబ్ భాయ్, పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు తెలంగాణ సాయి, ఇబ్రహీం ఖాన్, పలు సంక్షేమ సంఘాల నాయకులు, మహిళా నాయకురాల్లు, అనుబంధ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
