పూజలతో రెండో పంటకు నీటిని విడుదల చేసిన ప్రశాంతి రెడ్డి
సాక్షిత : రూ. 42 కోట్లతో కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరణ.
130 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ హయాంలో నిర్మించిన రిజర్వాయర్ ఆధునీకరణ
డెల్టా ప్రాంతమైన కోవూరులో రెండవ పంటకు పంటలు సస్యశ్యామలంగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కనిగిరి రిజర్వాయర్ నుండి ఈస్ట్రన్ ఛానల్ ద్వారా రెండో పంటకు శనివారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 130ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ హయాంలో నిర్మించిన కనిగిరి రిజర్వాయర్ ఐదు ప్రధాన కాలువల ద్వారా కోవూరు తో పాటు కావలి, సంఘం, దగదర్తి,విడవలూరు, మండలాలకు సాగు నీటిని అందిస్తుంది అన్నారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందేందుకు కాలవల్లో పూడికలు తీసే పనులు ముందుగా చేపట్టామన్నారు.
కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయంతో 42కోట్లు నిధులు మంజూరయ్యాయని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. కోవూరు నియోజకవర్గంలో జరిగే మహానాడు పసుపు పండుగని దీనికి ప్రతి ఒక్కరు సమిష్టిగా పనిచేయాలన్నారు. మహానాడుకు ప్రతిపక్షాలు సైతం ప్రచారం చేయడం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి పాళెం మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ, పెన్నా డెల్టా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, బుచ్చి మండల అధ్యక్షుడు గుప్తా శ్రీనివాసరావు,కె.వి శేషయ్య, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
