దేశాభివృద్దిలో జ‌నాభ లెక్క‌లు అత్యంత కీల‌కం

Sakshitha news

దేశాభివృద్దిలో జ‌నాభ లెక్క‌లు అత్యంత కీల‌కం

ప్ర‌జ‌లు స్వీయ‌గ‌ణ‌న‌లో పాల్గొనాలి

మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి. శ్రీ‌హ‌రిబాబు

సాక్షిత చిల‌క‌లూరిపేట‌: భారతదేశ అభివృద్ధికి జనాభా లెక్కలు కీలకమైన పునాది అని, ఇవి కేవలం జనాభా సంఖ్యను లెక్కించడమే కాకుండా, సామాజిక, ఆర్థిక, విద్యా ఆరోగ్య పరిస్థితులపై ఖచ్చితమైన డేటాను అందిస్తాయ‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి శ్రీ‌హ‌రిబాబు చెప్పారు. ప్రభుత్వ ప్రణాళికలు, వనరుల పంపిణీ, మరియు అభివృద్ధి పథకాల రూపకల్పనకు ఈ గణాంకాలు అత్యంత కీల‌క‌మ‌ని వివ‌రించారు. జనగణన–2027లో భాగంగా ప్రభుత్వం సూచించిన సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ ఈ నెల 30 వరకు జరుగుతుందన్నారు. జ‌న‌భా లెక్క‌ల సేక‌ర‌ణ‌లో భాగంగా దేశంలో మొదటిసారి పూర్తిగా డిజిటల్‌ విధానంలో జరగనున్న ఈ ప్రక్రియలో ప్రజలు తమ వ్యక్తిగత కుటుంబ వివరాలను ఎవరికి వారే నేరుగా పోర్టల్‌లో నమోదు చేయాల‌న్నారు. స్వీయ‌గ‌ణ‌న ఆ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత మొబైల్‌కు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ ఐడీ వస్తుందని, ఈ ఐడీని మే 1 నుంచి 30 వరకు ఇంటికి వచ్చే గణకులకు ఇవ్వాలని సూచించారు. వారు ఆ వివరాలు పరిశీలించి ప్రభుత్వానికి సమర్పించాక నమోదవుతాయని వెల్ల‌డించారు. ప్ర‌జ‌లంద‌రూ ఈ స్వీయ‌గ‌ణ‌న

Scroll to Top