విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా వేలాడుతున్న నెట్ , డిష్ కేబుళ్లను తొలగించాలి

Sakshitha news

విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా వేలాడుతున్న నెట్ , డిష్ కేబుళ్లను తొలగించాలి…

నోటీసులు జారీ చేసిన నగర పాలక సంస్థ…

సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా వేలాడుతున్న నెట్ , డిష్ కేబుళ్లను తొలగించాలని రామగుండం నగర పాలక సంస్థ సదరు నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. ముఖ్యoగా బి పవర్ హౌజ్ హనుమాన్ జoక్షన్ నుండి గోదావరి వంతెన వరకు హెచ్ కె ఆర్ రాజీవ్ రహదారి రోడ్డులో స్తంభాల ఆధారంగా లాగిన ఇంటర్ నెట్ ,డిష్ కేబుల్ తీగలను వెంటనే తొలగించి ప్రత్యామ్నాయం చూసుకోవాలని, రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ జె.అరుణశ్రీ సదరు నిర్వాహకులను కోరారు.
ఈ తీగలను తొలగించడానికి రామగుండం నగర పాలక సంస్థ సన్నాహాలు చేస్తుందని తెలిపారు.

Scroll to Top