చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలి………… జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ వి. రజని.
సాక్షిత వనపర్తి ; చట్టాల పైన ప్రతి ఒక్కరూ తప్పనిసరి గా అవగాహన కలిగి ఉండాలి అని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వి రజని అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో తాడిపర్తి లోని గాయత్రి బి.ఈ.డి కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి పోక్సో మరియు NDPS చట్టం గురించి వివరించారు.
ఈ చట్టాల గురించి కాబోయే ఉపాధ్యాయులుగా అవగాహన కలిగి ఉంటే భవిష్యత్తు తరాలైన విద్యార్థులను సక్రమమైన మార్గంలో నడిపించడానికి మార్గం సులువు అవుతుందని అన్నారు. అదేవిధంగా బాల్యవివాహాల నిర్మూలన చట్టం మరియు వినియోగదారుల రక్షణ చట్టం గురించి వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు , గాయత్రి బిఈడి కళాశాల అధ్యాపక బృందం మల్లికార్జున్, మోహన్, సురేష్, వీరభద్రయ్య, నిరంజన్ వలి, నాగేంద్రం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
