సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న…..
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి
సాక్షిత వనపర్తి :
వనపర్తి నియోజకవర్గం లోని
గోపాల్ పేట్ మండల కేంద్రంలో కోదండ రామాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ

శ్రీరామనవమి వేడుకలను కోదండ రామాలయ ఉత్సవ కమిటీ కల్యాణోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం సంతోషకరమైన విషయం అన్నారు. ఇలాంటి వేడుకల్లో స్వామివారి ఆశీస్సులు పొందడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ధర్మానికి ప్రతీక సత్యానికి ప్రతిరూపం మనిషిగా ఎలా జీవించాలో చూపించిన ఆదర్శమూర్తి శ్రీరామస్వామి . శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని దయతో నియోజకవర్గ ప్రజలు ఆనందం, ఆరోగ్యం ఐశ్వర్యం తో చల్లగా ఉండాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా ఏఐపిసి అధ్యక్షులు నాగార్జున, గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ జిల్లెల ప్రవీణ్ రెడ్డి,వనపర్తి మండల NSUI అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణ, పాండు రావు, విజయ భాస్కర్ రెడ్డి, మణిగిల్ల బాల్ రాజు, సిరివాటిసురేష్ పెద్దమండది మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
