చిలకలూరిపేట ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

Sakshitha news

చిలకలూరిపేట ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జనసేన యువ నాయకుడు ‘ప్రధాత’ చరణ్ తేజ

చిలకలూరిపేట:తెలుగు నూతన సంవత్సరం ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ద్వారా ‘ప్రధాత’ అనే విశిష్ట బిరుదును పొందిన చరణ్ తేజ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఉగాది నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి లాగే, ప్రజలందరూ కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన కోరారు.పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా, నియోజకవర్గ అభివృద్ధిలోనూ, ప్రజా సేవలోనూ యువతను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Scroll to Top