రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్, సతీమణి మనాలి ఠాగూర్ ల పెళ్లిరోజు

Sakshitha news

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్, సతీమణి మనాలి ఠాగూర్ ల పెళ్లిరోజు పురస్కరించుకొని కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు…

సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని: స్థానిక రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్, మనాలి ఠాగూర్ పెళ్లిరోజు పురస్కరించుకొని,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోదండ రామాలయంలో అర్చన, ప్రత్యేక పూజలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం అతిధులు డిప్యూటీ మేయర్ పాత పెళ్లి ఎల్లయ్య, టి పి సి సి సెక్రెటరీ కాల్వ లింగస్వామి మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడానికి తమ వంతుగా శ్రీరామ చంద్రునికి సీతమ్మకు లాగా, ఎల్లప్పుడూ తన వెంట ఉండి బడుగు బలహీన వర్గాలను ఆదుకొని ప్రతి వారిని ప్రేమతో హక్కును చేర్చుకునే ఈ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆ భగవంతుని కోరుకుంటూ. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న వారి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా నడపాలని ఆ భగవంతుని వేడుకుంటున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం.రవికుమార్, గట్ల. రమేష్, ముస్తఫా, నెలకంటి.రాము, దులికట్ట.సతీష్, మానస, శరత్, కొమ్ము. వేణు, దొంత శ్రీనివాస్, ఫజల్, నాయిని. ఓదెలు యాదవ్, కొప్పుల.శంకర్ సుతారి. లక్ష్మణ్ బాబు, బాలరాజు, కుమార్, సింహాచలం, రేణిగుంట్ల. తిరుపతి, స్వప్న, గజబింకర్ బాబు, బైరి. రాజకుమార్, నాంపల్లి. కంకణాల. రాజు, అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top