SAKSHITHA NEWS

తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీని అందజేశాం.*


సాక్షితSPS నెల్లూరు జిల్లా:* సర్వేపల్లి నియోజకవర్గం, “గడప గడప మన ప్రభుత్వం” కార్యక్రమంలో ముత్తుకూరు మండలంలోని చివరి గ్రామ సచివాలయమైన కృష్ణపట్నం గ్రామ సచివాలయ పరిధిలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .*
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి కాకాణి.


మంత్రి కాకాణికి బ్రహ్మరథం పట్టిన కృష్ణపట్నం యువత
గజమాలలతో, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు
గత ప్రభుత్వంలో మాదిరిగా మొక్కుబడి పర్యటనలు కాకుండా, ప్రతి సమస్యను నమోదు చేసుకొని వాటిని పరిష్కరిస్తున్నాం.


గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అన్ని హామీలు కూడా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం
2019 ఎన్నికల నాటికి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ అందించాం.
మత్స్యకారేతరులతో పాటు మత్స్యకారులకు కూడా నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ అందించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ది.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిషింగ్ జెట్టీకి శంకుస్థాపన చేశారు త్వరలోనే, పనులు ప్రారంభించి, పూర్తిచేస్తాం.
సుదీర్ఘకాలంగా పరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం.
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం.
గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించాం.
గతంలో ఏ శాసనసభ్యుడు చేయని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాం.
గ్రామాలలో అందరినీ కలుపుకొని గ్రామాల అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం.
2024 ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుంది.
గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు


SAKSHITHA NEWS