SAKSHITHA NEWS

యువత క్రీడల్లో రాణించాలి

  • పల్లపు బుద్దుడు

చిట్యాల సాక్షిత

యువత క్రీడల్లో రాణించాలని
బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్దుడు అన్నారు.
జిల్లా యువజన క్రీడ సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఉరుమడ్ల గ్రామంలో మే 1వ తేదీ నుండి మే31 వరకు జరుగనున్న ఉచిత హాకీ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు సందర్శించి క్రీడాకారులకు అరటి పళ్ళు, క్రీడాకారులకు శక్తిని అందించే స్నాక్స్ అందజేయడం జరిగింది. క్రీడా శిబిరాన్ని ఉద్దేశించి పల్లపు బుద్దుడు మాట్లాడుతూ నేటి వాతావరణానికి క్రీడల ద్వారా మానసిక ఉల్లాసాన్ని శారీరక దృఢత్వాన్నికి క్రీడలు బాగా ఉపయోగపడతాయని అలాగే క్రీడల ద్వారా మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చని అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం యోగా మెడిటేషన్ అలవాటు చేసుకోవాలని తెలియజేశారు. ఈ సమ్మర్ శిక్షణ శిబిరానికి ఉరుమడ్ల గ్రామంలో అనుమతి ఇచ్చిన డివైఎస్ వో మగ్బూల్ అహ్మద్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ శిబిరం కోచ్ గంగాపురం రాము, వ్యాయామ ఉపాధ్యాయులు కొండ పరమేష్, సుంకరి మల్లేష్, వెలుగు చంద్రశేఖర్ మరియు క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS