

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నందమూరి, నారా కుటుంబాలకు సంఘీభావం తెలిపారు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాం. తమ పార్టీ అధినేతను అక్రమంగా అరెస్టు చేశారని రాజమండ్రిలో కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను, నందమూరి తారకరామారావు కుమారుడు నందమూరి రామకృష్ణను యువనేత డాక్టర్ కోడెల శివరాం సత్తెనపల్లి నుండి తన అనుచరులతో మర్యాదపూర్వకంగా కలిసి తమ మద్దతును తెలియజేశారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని చంద్రబాబు త్వరలోనే జైలు నుండి బయటకు వస్తారని, వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయాలకు చరమగీతం పాడే రోజు అతి దగ్గరలోనే ఉందని యువనేత డాక్టర్ కోడెల శివరాం తెలిపారు.