SAKSHITHA NEWS

Yoga Day at Kondakal Zilla Parishad High School

కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో యోగ దినోత్సవం
…………………………………………………………………….

సాక్షిత శంకరపల్లి : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శంకరపల్లి మండల పరిధి కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా కార్యక్రమం విద్యార్థుల చేత నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి కొండకల్లోని యోగా మాస్టర్ గిరి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ధ్యానము మరియు యోగాసనాల గురించి వివరించారు ప్రతిరోజు యోగా చేయడం వలన ఆరోగ్యంగా ఉంటాము మరియు మానసిక ఆందోళనలు అన్ని దూరం అవుతాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS